Header Banner

హాట్‌లైన్‌లో ఇరు దేశాల డీజీఎంఓల చర్చలు.. పాకిస్థాన్ సైన్యానికి భారత్ వార్నింగ్!

  Wed Apr 30, 2025 22:14        Politics

జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో గత వారం జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో ఇరు దేశాల డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓలు) హాట్‌లైన్‌లో చర్చలు జరిపారు. నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంబడి పాకిస్థాన్ సైన్యం పదేపదే రెచ్చగొట్టే విధంగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని, ఇలాంటి చర్యలను మానుకోవాలని భారత్ ఈ సందర్భంగా పాక్‌ను గట్టిగా హెచ్చరించినట్లు రక్షణ వర్గాలు వెల్లడించాయి. గత ఆరు రోజులుగా ఎల్ఓసీ వెంబడి కాల్పులకు తెగబడుతున్న పాకిస్థాన్, తాజాగా జమ్మూలోని అంతర్జాతీయ సరిహద్దు (ఐబీ) వద్ద కూడా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఏప్రిల్ 29-30 రాత్రులతో పాటు, బారాముల్లా, కుప్వారా జిల్లాల్లోని నియంత్రణ రేఖ వెంబడి, పర్గ్వాల్ సెక్టార్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాక్ సైన్యం చిన్నపాటి ఆయుధాలతో కాల్పులకు పాల్పడిందని, భారత సైనిక బలగాలు దీనికి తగిన రీతిలో స్పందించాయని రక్షణ శాఖ ప్రతినిధి ఒకరు బుధవారం తెలిపారు. అంతర్జాతీయ సరిహద్దు వద్ద కాల్పులు జరగడం అరుదని, పహల్గామ్ దాడి తర్వాత పాకిస్థాన్ కవ్వింపు చర్యలను తీవ్రతరం చేసిందని భావిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి: పలు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన సీఎం చంద్రబాబు! లిస్ట్ ఇదుగోండి..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి..

 

అద్భుతమైన స్కీం.. మీ భార్య మిమల్ని లక్షాధికారిని చేయొచ్చు.. ఈ‌ చిన్న పని తో..

 

కొత్త రేషన్ కార్డులపై శుభవార్త చెప్పిన మంత్రి.. ప్రతి కుటుంబానికి ఉచితంగా - తాజాగా కీలక ప్రకటన!

 

6 లైన్లుగా రహదారి, డీపీఆర్‌పై కీలక అప్డేట్! ఆకాశనంటుతున్న భూముల ధరలు..

 

సీఐడీ క‌స్ట‌డీలో పీఎస్ఆర్ - మూడో రోజు కొనసాగుతున్న విచారణ! 80కి పైగా ప్రశ్నలు..

 

స్కిల్ కేసు లో చంద్రబాబుని రిమాండ్ చేసిన న్యాయమూర్తి! న్యాయ సేవా అధికార సంస్థ సభ్య కార్యదర్శిగా నియామకం! ప్రభుత్వం జీవో జారీ!

 

మరి కొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం! ఎవరెవరు అంటే?

 

ఏపీ రాజ్యసభ స్థానం - ఎన్డీఏ అభ్యర్థి ఖరారు! మరో రెండేళ్ల పదవీ కాలం..

 

శుభవార్త: వాళ్ల కోసం ఏపీలో కొత్త పథకం.. రూ. లక్ష నుంచి రూ.8 లక్షలు పొందొచ్చు.. వెంటనే అప్లై చేసుకోండి!

 

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్!

 

గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Sports #teamindia